అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు ఘటన యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అయితే ఈ ఘటన జరిగిన కాసేపటికే చైనాలో ఆన్‌లైన్ రిటైలర్లు ఆయన ఫొటోతో టీషర్ట్‌లు ప్రింట్ చేసి విక్రయించారు. కాల్పుల అనంతరం ట్రంప్ పిడికిలి చూపించిన ఫొటోతో పాటు దాడిలో గాయపడిన చిత్రాలను వాటిపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ఈ టీషర్టులు నెట్టింట వైరల్‌గా మారాయి.