మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో మంచు విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. ఇది మా కుటుంబ విషయం. ఈ విషయంలో భాగమైన బయటవాళ్లకు ఈరోజు సాయంత్రం వరకూ అవకాశం ఇస్తున్నా. వాళ్లంతట వాళ్లే వెనక్కి తగ్గాలి. లేదంటే వాళ్ల పేర్లు నేనే బయటపెడతా’ అని విష్ణు హెచ్చరించారు.