ఇండిగో విమానంలో సీటు కుషన్‌ మాయం

68చూసినవారు
ఇండిగో విమానంలో సీటు కుషన్‌ మాయం
యవనికా అనే ప్రయాణికురాలు మార్చి 6న బెంగళూరు నుంచి భోపాల్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆ విమానంలో రెండు సీట్లకు కుషన్ లేకపోవడాన్ని గమనించిన ఆమె ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బ్యూటిఫుల్@ఇండిగో6ఈ. నేను సురక్షితంగా దిగుతానని ఆశిస్తున్నా. ఇది బెంగళూరు నుంచి భోపాల్ వెళ్లే 6ఈ6465 మీ(ఇండిగో) విమానం’ అని అందులో పేర్కొన్నారు. కుషన్ లేని సీటు ఫొటోను షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్