గోరంత సైజులో.. కొండంత భక్తి

78చూసినవారు
గోరంత సైజులో.. కొండంత భక్తి
అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేళ దేశం మొత్తం రామనామస్మరణతో వీరజిల్లుతోంది. ఈ క్రమంలో భక్తులు వారికి తోచిన విధంగా భక్తిని చాటుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి గోరంత సైజులో బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. 2.730 మిల్లి గ్రా. బంగారంతో 1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు, 2.75 సెంమీ పొడవుతో ఆలయాన్ని తయారు చేశాడు. అందులో శ్రీరాముడుని ఏర్పాటు చేయడం మరో విశేషం.

సంబంధిత పోస్ట్