రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్: కేంద్ర మంత్రి

58చూసినవారు
రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్: కేంద్ర మంత్రి
నీట్-పీజీ 2024 కొత్త షెడ్యూల్‌ను రెండు రోజుల్లో ప్రకటిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పేపర్ లీక్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుందని చెప్పారు. పలు పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ముందుగానే నీట్-పీజీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు యూజీసీ-నెట్‌ పరీక్ష జరిగిన తర్వాతి రోజు రద్దు చేయగా ఆగస్టు 21, సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్