బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ తమీమ్ ఇక్భాల్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్ తో జరుగుతున్న సిరిస్ లో తొలి మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆటకు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. బంగ్లాదేశ్ తరపున మంచి ఓపెనర్ గా గుర్తింపు పొందిన తమీమ్, టెస్టుల్లో 5,083 పరుగులు, వన్డేల్లో 8,313 పరుగులు చేశాడు.