అధునాతన టెక్నాలజీని ఉపయోగించడంలో ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేసింది. విపత్తుల సమయాల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు రోబోటిక్ బోట్ అనే కొత్త తరహా బోట్‌ను ప్రవేశపెట్టనుంది. దీని కోసం గురువారం ఒక Robotic Life Boatను తీసుకొని, వరదల్లో వాడి.. అది ఎలా పని చేస్తుంది అనేది APSDRF సిబ్బంది ప్రయోగాలు చేశారు. వరదల్లో ఎవరైనా గల్లంతైతే ఈ బోట్ రంగంలోకి దిగుతుందని, గంటకు 7 కి. మీ వేగంతో ఈ బోట్ నడుస్తుందని అధికారులు వెల్లడించారు.