వంటగదిలో ఉల్లిపాయకి అతి ముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇది లేకుండా ఏ వంటకం పూర్తికాదు. చలికాలంలో ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే విటమిన్స్, పొటాషియం వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో ఉల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జట్టు రాలడాన్ని నివారిస్తుంది.