దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖర్
హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంగుల పండుగ
హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
హోలీ మన బంధాలను పునరుజ్జీవింపజేసుకోవడానికి, వసంతకాలం రాకను స్వాగతించడానికి ఓ మంచి ఘట్టంగా ఉపయోగపడుతుంది. ఇది ఆనందకరమైన జీవితాన్ని, ప్రకృతిని ప్రతిబింబిస్తుంది.
హోలీ రంగులు అందరి జీవితాలను ఆనందం, ఆశ, సామరస్యంతో నింపేయాలి’ అంటూ ట్వీట్ చేశారు.