అమెరికాలోని అరిజోనాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 'వెల్స్ ఫార్గో' కంపెనీలో డెనిస్ ప్రుదోమ్మె (60) అనే మహిళ పని చేస్తోంది. చివరిసారిగా ఆమెను ఆగస్టు 16న ఆఫీసులో కొందరు చూశారు. తర్వాత బంధువులు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఆగస్టు 20న ఆమె క్యాబిన్‌లో స్పృహ లేకుండా ఉండడాన్ని ఓ గార్డు గమనించాడు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.