రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు: నారాయణ

72చూసినవారు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు: నారాయణ
రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతించిందని చెప్పారు. రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1,508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్లు తెలిపారు. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి, సీఆర్‌డీఏ పరిధిలో రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏ అథారిటీ అనుమతించిందన్నారు. ఐదు ఐకానిక్‌ టవర్లకు ఈ నెల 15లోపు డిజైన్లు వస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్