ఇటీవల కొందరు రీల్స్ చేస్తు జలపాతం పైనుంచి జారిపడిన సంఘటనలు వార్తల్లో చూసే వుంటాం. తాజాగా మరో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ జలపాతం పైన నిలబడిన వ్యక్తి కిందకు దూకేందుకు ప్రయత్నించగా కాలు జారి ఎత్తు నుంచి నీళ్లలో పడిపోయాడు. ఈ క్రమంలో రాళ్లకు తగులుకుని మరీ పడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.