ఏపీ అసెంబ్లీలో బూతులు లేవని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు మాట్లాడే వారు లేకపోవడం సంతోషకరం అని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే అదే వారికి చివరి రోజని సీఎం హెచ్చరించారు. రౌడీలను వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నానని CBN తేల్చిచెప్పారు.