కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని శుక్రవారం అన్నారు. బెంగళూర్ శివారులో బీజేపీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ‘‘జన ఆందోళన్ సభ’’ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా స్వభావం, సామర్థ్యం ఉన్న ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నారు.