లడ్డూ విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారాలు చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. లడ్డూ బ్లాక్ మార్కెట్‌ను, దళారులను ఆరికట్టేందుకు చిన్నమార్పు చేశామన్నారు. టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు.