ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఉన్న నిబంధనలివే

66చూసినవారు
ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఉన్న నిబంధనలివే
ఉత్తరాఖండ్‌ లో బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఉన్న నిబంధనలు ఏంటంటే.! ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా ఈ చట్టం వర్తిస్తుంది. పెళ్లి చేసుకునేందుకు పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 ఏళ్ళు కలిగి ఉండాలి.వివాహ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి. సహజీవనం చేయాలనుకొనే వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్