మేక పిల్లలకు పారుడు వ్యాధి "మొర్బిల్లి వైరస్" వల్ల వస్తుంది. మేకల మందలో ఒక దాని నుండి మరొక దానికి వ్యాప్తి చెంది 4 నుండి 10 రోజులలో లక్షణాలు కనబడతాయి. వ్యాధి సోకిన మేకలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన 2, 3 రోజుల తరువాత మేకలు పలుచగా పారడం, రక్తంతో కూడిన విరేచనాలు అవడం, కొన్ని సందర్భాల్లో నలుపు రంగులో విరేచనాలు గమనించవచ్చు. దగ్గు ఎక్కువగా రావడంతో పాటు కళ్లు, ముక్కు నుంచి నీరు కారుతుంది.