ఇంటి పైకప్పు నుంచి పడిపోయిన దొంగ (వీడియో)

80చూసినవారు
యూపీలోని మొరాదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దొంగ చోరీ చేసేందుకు ఇంటి పైకప్పు ఎక్కి ఇంట్లో చొరబడ్డాడు. అయితే ఆ ఇంట్లోని వారు మేల్కొనడంతో దొంగ భయపడ్డాడు. తప్పించుకునే ప్రయత్నంలో ఇంటి పైకప్పు నుంచి జారి కింద పడ్డాడు. పై నుంచి పడడంతో గాయాలపాలయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ దొంగను ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్