ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు గురవుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ పోర్టు ద్వారా టన్నుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో శుక్రవారం ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాకినాడకు బయలుదేరి వెళ్లారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఎవరున్నా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.