శరీరంలో ఏదైనా అవయవం ప్రమాదానికి గురైనా, చచ్చుబడినా దాన్ని మునుపటి స్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ (భౌతిక చికిత్స). నిర్దేశిత పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా ఫిజియోథెరపిస్టులు సాంత్వన చేకూరుస్తారు. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, జీవనశైలి, వృత్తి నేపథ్యాల కారణంగా వస్తున్న నొప్పులు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు మొదలైనవాటి తీవ్రతను తగ్గించడమే ఫిజియోథెరపీ ప్రధాన కర్తవ్యం.