VESPA 946 డ్రాగన్ స్కూటర్ ధర గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్. మిడ్ రేంజ్ కారు కంటే కూడా ఖరీదైనది. దీని పరిమిత ఎడిషన్ మోడల్ (150cc) ఎక్స్ షోరూమ్ ధర ఏకంగా రూ.14.27 లక్షలు. దీనిని కంప్లీట్లీ బిల్ట్ అప్ యునిట్ (CBU)గా ఇండియాకి తీసుకురావడంతో CKD వాహనాల కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇది మేడిన్ ఇండియా ప్రొడక్ట్ కాదు. అందుకే పన్నులు అధికంగా ఉంటాయి.