గిరిజనులు కుంతీదేవిని గొంతెమ్మ దేవతగా కొలుస్తారు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులతోపాటు, కర్ణుడు కూడా చనిపోతాడు. అయితే కర్ణుడు తమ అగ్రజుడని, తన తల్లి రహస్యాన్ని దాచిపెట్టిందని తెలుసుకున్న ధర్మరాజు.. ‘ఆడవారి నోటిలో నువ్వు గింజ కూడా నానరాదు’ అని కుంతీదేవిని శపించాడట. అప్పుడు కుంతీదేవి మనస్థాపంతో వెళ్లిపోగా గిరిజనులు ఆశ్రయం కల్పించారట. అప్పటి నుంచి గిరిజనులు కుంతీదేవిని తమ ఆడపడుచుగా భావించి పూజలు జరుపుతారు.