మరిగించిన పాలు పొంగడం వెనుక రహస్యం ఇదే

67చూసినవారు
మరిగించిన పాలు పొంగడం వెనుక రహస్యం ఇదే
పాలను బాగా మరిగిస్తే పొంగుతాయి. కానీ నీటిని మరిగిస్తే మాత్రం అవి పొంగవు. పాలలో కొవ్వు, ప్రోటీన్‌, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటితో పాటు నీరు కూడా ఉంటుంది. పాలను వేడి చేసినపుడు పాలతో పాటు అందులోని నీరు కూడా వేడెక్కుతుంది. అయితే పాలలోని ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ చిక్కాగా మారి పాలపై ఒక పొరలాగా ఏర్పడుతాయి. దీంతో నీటి ఆవిరి పాత్ర పైకి వచ్చే క్రమంలో అడ్డుగా ఉన్న పొరను నెట్టడం వల్ల పాలు పొంగుతాయి. ఈ మూలకాలు నీటిలో ఉండవు కాబట్టి నీళ్లు పొంగవు.

సంబంధిత పోస్ట్