తన తల్లి సరోజ్ సూద్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఒకసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది. లవ్ యూ సో మచ్’ అని రాసుకొచ్చారు.