ప్రధాని మోదీ ఇవాళ శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని లూటీ చేసినట్లు ఆరోపించారు. దోచుకోవడమే తమ జన్మహక్కుగా ఆ పార్టీలు భావించాయన్నారు. ఆ మూడు పార్టీల కుటుంబ పాలనలో.. జమ్మూకశ్మీర్ యువత నలిగిపోయినట్లు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో అధిక సంఖ్యలో ఓటింగ్ జరగడం పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు ప్రధాని తెలిపారు.