వ్యాపారికి బెదిరింపు.. ఎంపీపై కేసు నమోదు

77చూసినవారు
వ్యాపారికి బెదిరింపు.. ఎంపీపై కేసు నమోదు
బిహార్‌లోని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌పై కేసు నమోదైంది. ఓ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ రోజున తన ఇంటికి పిలిపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆ వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పూర్నియా జిల్లా పోలీసులు పప్పుయాదవ్‌పై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్