హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు

61చూసినవారు
హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు
తేలికగా డబ్బులు సంపాదించాలని ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అడ్డదారులు తొక్కారు. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా వారిని ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు బుధవారం అర్ధరాత్రి మాదాపూర్ ప్రాంతంలో 30 ఎల్ఎస్‌డి బ్లాడ్స్ డ్రగ్స్ ను విక్రయానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ డ్రగ్స్ విలువ రూ.70 వేలు ఉంటుందని తెలిపారు. నిందితులు చెన్నైలో డ్రగ్స్ కొని, హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్