తాళం పగలగొట్టుకుని బోను నుంచి బయటకు వచ్చిన పులి (వీడియో)

62చూసినవారు
బోనులో బందీగా ఉన్న పులి తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చింది. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాళం కప్పను నోటితో పట్టుకుని లాగుతూ దానిని పగలగొట్టేందుకు పులి ప్రయత్నించింది. ఆ తర్వాత కాలితో బోను తలుపును లాగేందుకు ప్రయత్నించింది. రాకపోవడంతో మరోమారు తాళంకప్పను నోటితో పట్టుకుని బలంగా లాగింది. ఆ తర్వాత తలుపు తీసుకుని దర్జాగా బయటకు వచ్చింది. ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.

సంబంధిత పోస్ట్