అమెరికాలో ఇటీవల టిక్‌టాక్‌ను నిషేదించారు. యూఎస్ నిబంధనలకు కట్టుబడని కారణంగా ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. అయితే అమెరికాలో దీనికి 170 మిలియన్ల మంది యూజర్లు ఉండటంతో తిరిగి మళ్లీ ప్రవేశపెట్టారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీని నిషేధాన్ని ఆలస్యం చేయడంతో.. మళ్లీ యాపిల్, గూగుల్ ప్లే స్టోర్లలో టిక్‌టాక్ దర్శనమిచ్చింది.