AP: గుంటూరు జీజీహెచ్‌లో గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఐదుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సిండ్రోమ్ బాధితుల చేతులు, కాళ్లు నీరసంగా ఉంటాయని, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. చిన్నపిల్లలకూ ఈ వ్యాధి సోకుతుందని, త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.