వివాహ సమయాల్లో కొందరు తెలీక చేసే పనులు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్.. వరుడిని వధువు తలపై ముద్దు పెడుతూ కెమెరాకు ఫోజు ఇవ్వమని చెప్పగా.. వరుడు తెల్లమొహం వేశాడు. దీంతో ఆ పక్కనే ఉన్న యువతి వధువు తలపై ముద్దు పెట్టి చూపిస్తుంది. ‘‘ఇలాగే నువ్వూ చేయ్’.. అని వరుడికి చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు.