ఒకప్పుడు మహిళలంతా సాయంత్రం వేళల్లో ఒక దగ్గరకు చేరి, పాటలు పాడుకోవడం, పండగ వచ్చిందంటే కలిసికట్టుగా పిండివంటలు వండుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ ఆన్‌లైన్‌లో, షాపుల్లో దొరకడంతో వండుకోవడమూ తగ్గింది. తమ జానపద కళలను పక్కన పెట్టి, నేడు వినోదం కోసం టీవీలకు అలవాటుపడ్డారు. వాటిల్లో వచ్చే సీరియళ్ల ప్రభావం, భావజాలపరమైన దాడి చేస్తున్నాయి. పగ, ప్రతీకారం, ఈర్ష్యా, ద్వేషాలు ప్రేరేపిస్తున్నాయి. ఇవి మహిళల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయి.