పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా అబ్దుల్ కలామ్ పేరు తెచ్చుకున్నారు. ‘కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి’ అంటూ యువతకు ఇచ్చిన సందేశం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. భారతరత్న కలామ్‌కు పిల్లల మీద ఉన్న ప్రేమను, ఆ ప్రోత్సాహన్ని గుర్తించి ప్రపంచ దేశాలు ఆయన పుట్టిన రోజైన అక్టోబర్15ను ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా నిర్వహిస్తున్నాయి. ఇది కలామ్‌కే కాదు! భారతదేశ పౌరులందరికీ గర్వకారణం.