1955లో మద్రాసులో కలామ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరారు. ఓసారి కలామ్ చేస్తున్న ప్రాజెక్ట్‌లో పురోగతి లేకపోవడంతో.. 3 రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే ఉపకారవేతనం రద్దు చేస్తానని డీన్ ఆయనను బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి కలామ్ డీన్‌ను ఆకట్టుకున్నారు. 8 స్థానాల కోసం జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానం పొందిన కలామ్ 'యుద్ధ పైలట్' కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు.