తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఆయన ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతి అక్షరంలోనూ అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించగలిగిన శక్తి ఆయన సొంతం. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాథ స్పృశించని ప్రక్రియలేదు. ఆధునిక తెలుగు రచయితల్లో ఆయన పేరు లేకుండా తెలుగు సాహిత్య చరిత్ర గురించి వివరించలేం. అలాంటి మహానుభావుడి జయంతి నేడు.