ఇవాళ ప్రపంచ లూపస్ దినోత్సవం

70చూసినవారు
ఇవాళ ప్రపంచ లూపస్ దినోత్సవం
ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 10 వ తారీఖున నిర్వహించుకుంటారు. నిజానికి లూపస్ వ్యాధి గురించి ఎక్కువమందికి అవగాహన లేదు. దీని గురించి తెలుసుకుంటే వైద్యశాస్త్రాన్నే తెలుసుకున్నట్టు అని అంటుంటారు. ఈ లూపస్ వ్యాధి ఎంత భయంకరమైనదంటే ఒక్కసారి వస్తే మన శరీరంలోని అన్ని అవయవాలపైన దాడి చేస్తుంది. చర్మం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు.. ఇలా ఏ అవయవాన్ని వదలదు. అందుకే లూపస్ గురించి ప్రజల్లో అవగాహన అవసరమని భావించి, అందుకోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్