ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను అలరిస్తున్న పారిస్ ఒలింపిక్స్‌కు ఇవాళే ముగింపు. 19 రోజుల క్రీడా వినోదానికి తెరపడనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 12.30 గంటలకు క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ క్రీడల్లో శనివారంతోనే భారత ప్రయాణం ముగిసింది. ఒలింపిక్స్ చివరి రోజు అథ్లెటిక్స్ (మహిళల మారథాన్), బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, హ్యాండ్‌బాల్, మోడర్న్ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్లింగ్, రెజ్లింగ్‌లో పోటీలున్నాయి.