ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. మహేశ్ బాబు, రానా, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్, అక్కినేని అఖిల్, రాశీఖన్నా సహా పలువురు వేడుకకు వచ్చారు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరీ నాథ్ కూడా ఈ వివాహానికి విచ్చేశారు.