వాట్సాప్ లింక్డ్ డివైస్ ఫీచర్ సహాయంతో ఒక ఖాతాను సులభంగా బహుళ పరికరాలలో ఉపయోగించవచ్చు. దీనికోసం వాట్సాప్ వెబ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. యూజర్లు ఒకే ఖాతా సహాయంతో గరిష్టంగా 4 డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీ ప్రైమరీ వాట్సాప్ తెరిచి, ఆపై స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెను ఐకాన్‌పై నొక్కండి. తర్వాత లింక్డ్ ఎ డివైజ్ ఆప్షన్‌పై నొక్కి, QR కోడ్ స్కానర్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.