విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి

23218చూసినవారు
విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి
కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోవడం తల్లిదండ్రులను కలచివేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబయ్య గూడెంకు చెందిన మడకం సాయి, లిఖిత కూతురు కల్నిష(3) నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారులోకి ఎక్కింది. డోర్స్ లాక్ అవడంతో కారులో ఊపిరాడక స్పృహ తప్పింది. పాప కోసం వెతికి గమనించిన పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్