బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ మృతి

50చూసినవారు
బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ మృతి
బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు అనీస్ బాజ్మీ వెల్లడించారు. పొద్దార్ లండన్‌లో ఉన్నారని, ఆయన మరణించడానికి కొన్ని గంటల ముందే తనతో మాట్లాడానని తెలిపారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. కాగా, బర్ఫీ, ఫైటర్, పఠాన్ లాంటి చిత్రాలకు ఆయన పనిచేశారు.

సంబంధిత పోస్ట్