ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 71 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 68 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.