అమెరికా భద్రతకు ట్రంప్‌ ప్రమాదకారి: జో బైడెన్‌

84చూసినవారు
అమెరికా భద్రతకు ట్రంప్‌ ప్రమాదకారి: జో బైడెన్‌
అమెరికా భద్రతకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంతో ప్రమాదమని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలన్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్‌ గెలిస్తే ఏం జరుగుతుందో చూడండన్నారు. ‘‘అమెరికా భద్రతకు ట్రంప్‌ నిజమైన ప్రమాదకారి. ప్రపంచ చరిత్రలో ప్రస్తుతం మనం టర్నింగ్‌ పాయింట్‌లో ఉన్నాం. ప్రజాస్వామ్యం ఎంతో కీలకం’’ అని అమెరికా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్