అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొల రోజే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జల వనరు ఇది. అయితే ట్రంప్ ప్రతిపాదనలను మెక్సికో మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది.