టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం

50చూసినవారు
టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం
యూజర్ల డేటా స్వీకరిస్తోందన్న కారణంతో టిక్‌టాక్‌పై నిషేధం విధించేందుకు అమెరికా బిల్లును రిపబ్లికన్లు యూఎస్ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. టిక్‌టాక్‌తో మంచీ, చెడు రెండు ఉన్నాయని, ఎంతోమంది ఆ యాప్‌ను ఇష్టపడుతున్నారని తెలిపారు. దీనిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి అమెరికన్లకు నిజమైన శత్రువు ఫేస్‌బుక్ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్