చెవి పోటు సమస్యను చిన్న పాటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకుల రసాన్ని రెండు చుక్కలు చెవిలో పోయాలి. ఇలా చేస్తే చెవి నొప్పి ఉండదు. వేడి చేసి చల్లార్చిన నువ్వుల నూనె రెండు చుక్కలు చెవిలో వేసినా ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన వెల్లుల్లి, అల్లంను ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా నొప్పి, వాపు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.