కర్ణాటకలోని హోస్పేట వద్ద తుంగభద్ర డ్యామ్ 19వ గేటు వరద ధాటికి కొట్టుకుపోయింది. ఫలితంగా లక్ష క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా అయినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చైన్‌లింక్ తెగిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో తుంగభద్ర నుంచి మొత్తం 60 టీఎంసీల నీరు వృథాగా పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత కర్నూలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు.