కేటీఆర్ నటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సంగారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఇద్దరు సీఎంలు ఉన్నారు. ఒకరు రేవంత్‌రెడ్డి.. మరొకరు కేటీఆర్. ఫార్ములా-ఈ రేసింగ్‌లో కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. BJPని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నాయి. BRS విధ్వంసకర పార్టీ.. దాన్ని నిషేధించాలి. అలాంటి పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందే' అని అన్నారు.