AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఒంటిపూట బడుల సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేశారు.