అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి కోసం ఇద్దరు ప్రియురాళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరికి తెలియకుండా ఒకరితో ఓ యువకుడు ప్రేమాయణం నడిపాడు. దీంతో విషయం తెలుసుకున్న ప్రియురాళ్లు.. పురుగుల మందు తాగారు. వారిలో ఒక యువతి శారద మృతి చెందగా..మరో యువతి రేష్మా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.